శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగింది : చంద్రబాబు
తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తెలిపారు. హిందువులందరి ప్రతిబింబం తిరుమల క్షేత్రమని తెలిపారు. తిరుమల లడ్డూతో పాటు ముడిసరుకుల నాణ్యత పరిశీలనకు..త్వరలో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. తిరుమల కొండపై గోవింద నామ స్మరణ తప్ప మరేదీ వినిపంచకూడదని తెలిపారు.
పవిత్ర క్షేత్రంలో...
అవసరమైతే ఐఐటీ నిపుణుల సహకారం తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. నాణ్యమైన,రుచికరమైన అన్నప్రసాదాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. గతం కన్నా శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందన్న చంద్రబాబు భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తీసుకుని..సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తిరుమలకు పూర్వవైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వీఐపీ దర్శనాలను తగ్గించాలన్నారు. సామాన్యులకు దేవదేవుని దర్శన భాగ్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.