ఆర్థికశాఖ అధికారులతో జగన్ భేటీ.. అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ అధికారులతో పాటు మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. రేపటి నుంచి ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టనుండటం, ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతుండటంతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
వారి ప్రధాన డిమాండ్లపై....
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ప్రధానంగా హెచ్ఆర్ఏ లో శ్లాబులు పాతపద్ధతిలోనే కొనసాగించడం, ఎలాంటి రికవరీ చేయకపోవడం వంటి అంశాలపై ఆర్థిక శాఖ అధికారులతో జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల అదనంగా ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని కూడా అంచనా వేసి జగన్ కు ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం.