Chandrababu : నేడు చంద్రబాబు సమీక్ష చేయనున్న శాఖలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్షలు చేయనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వివిధ శాఖలపై సమీక్షలు చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి రానున్నారు. తర్వాత చంద్రబాబు ఐటీ పాలసీపై సమీక్ష నిర్వహించనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.కొత్త పాలసీ విధానంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మున్సిపల్ శాఖపై...
కొత్త ఐటీ పాలసీలో విధివిధానాలు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై చంద్రబాబు అధికారులకు వివరించనున్నారు. ఎక్కువ సంఖ్యలో ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకునేందుకు అవసరమైన చర్యలు ఏం తీసుకోవాలో దానిపై నేడు చర్చించనున్నారు. తర్వాత మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్షను చంద్రబాబు చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో జరిగే వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలో పాల్గొంటారు.