Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం నేడు విడుదల చేసింది;

Update: 2024-10-03 03:12 GMT

chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ముఖ్యమంత్రి కార్యాలయం నేడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయానికి రానున్నారు. జి.ఎస్.డి.పి వృద్ధిపై సమీక్ష చేయనున్నారు. అధికారులతో ఆయన సమావేశం జరగనుంది.

శాఖలపై సమీక్ష...
సాయంత్రం ఐ అండ్ పీఆర్ శాఖపై సమీక్ష చేయనున్నారు. , అనంతరం నెలవారీ సమస్యల పరిష్కారంపై సమీక్షను చంద్రబాబు నాయుడు నిర్వహిస్తారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు సత్వరం పరిష్కారం అవుతున్నాయా? లేదా? అన్న దానిపై అధికారులతో చర్చిస్తారు. ఎలాంటి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తారు.


Tags:    

Similar News