టీడీపీది అనవసర రాద్ధాంతం
జంగారెడ్డి గూడెం లో మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు
జంగారెడ్డి గూడెం లో మరణాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరింత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. 55 వేల జనాభా ఉన్న ఆ పట్టణంలో నాటుసారా ఎవరైనా కాల్చగలరా? అని ప్రశ్నించారు. నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా కాయడం సాధ్యం కాదని చెప్పారు. చంద్రబాబు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వంపై కావాలని బురద చల్లే కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించిందని జగన్ చెప్పారు.
ఆ మరణాలన్నీ....
ఒకరోజులో చనిపోలేదని, పదిహేను రోజుల్లో సంభవించిన మరణాలను రాజకీయాలకు చంద్రబాబు ఉపయోగిస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం నాటుసారా కాసే వాళ్లపై 13 వేల కేసులు నమోదు చేశామన్నారు. సాధారణ మరణాలపై తప్పుడు రాజకీయం చేస్తున్నారని అన్నారు. విషప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ అన్నారు.