మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియో

సత్యసాయి జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.

Update: 2022-06-30 04:18 GMT

సత్యసాయి జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. పారిస్ లో ఉన్న ఆయన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్‌గ్రేషియోను జగన్ ప్రకటించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. అలాగే ఏపీసీడీసీఎల్ కూడా మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ప్రకటించింది. దీనిపై విచారణకు ఆదేశించింది.

ఐదుగురు మహిళలు....
శ్రీసత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలం కొండపల్లిలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్తు తీగ పడి ఐదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. మృతిచెందిన వారిని గుడ్డంపల్లి వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోట్లకు చెందిన కుమారిగా గుర్తించారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News