పంప్ హౌస్ ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ను జగన్ ప్రారంభించారు

Update: 2023-09-19 06:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ను జగన్ ప్రారంభించారు. ఈ పంప్ హౌస్ ద్వారా నాలుగు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందనుంది. 10,394 ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వెంట రాగా పంప్ హౌస్ ను ప్రారంభించి దిగువకు జగన్ నీటిని విడుదల చేశారు.

నాలుగు నియోజకవర్గాలకు...
ఈ నీరు డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు కూడా అందుతుందని తెలిపారు. ఈ పంప్ హౌస్ ద్వారా విడుదలయి నీరు నాలుగు నియోజకవర్గాల్లో 77 చెరువులకు ఎత్తిపోసే ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు జగన్. ఆంకొండలో మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హర్షధ్వనాల మధ్య జగన్ నీటిని విడుదల చేశారు.


Tags:    

Similar News