ఆ ప్రాజెక్టు ప్రారంభించే ఎన్నికలకు వెళతా
చీమకుర్తిలో గ్రానైట్ పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు
చీమకుర్తిలో గ్రానైట్ పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు చీమకుర్తి మెయిన్ రోడ్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ చీమకుర్తి ప్రాంతం గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు అని అన్నారు. కరోనా కారణంగా చిన్న గ్రానైట్ పరిశ్రమలు దెబ్బతిన్నాయని జగన్ అభిప్రాయపడ్డారు.
గ్రానైట్ పరిశ్రమలను....
అందువల్లనే గ్రానైట్ పరిశ్రమలను ఆదుకునేందుకు శ్లాబ్ విధానం తీసుకువచ్చామని తెలిపారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు యూనిట్ కు రెండు రూపాయల విద్యుత్తు ఛార్జీలను తగ్తిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. ఏడు వేల యూనిట్లకు లబ్ది చేకూరేలా జీవో జారీ చేశామన్నారు. దీనివల్ల చిన్న పరిశ్రమలు బాగుపడతాయని తెలిపారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించిన తర్వాతనే తాను ఎన్నికలకు వెళతా అని జగన్ అన్నారు. అలాగే విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏప్రిల్ 14న ఆవిష్కరణ ఉంటుందని జగన్ తెలిపారు.