రాజ్యాంగం మన రూల్ బుక్

అంబేద్కర్ భావజాలాన్ని మనాసా వాచా గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.;

Update: 2022-11-26 06:39 GMT

అంబేద్కర్ భావజాలాన్ని మనాసా వాచా గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం చాలా గొప్పది అని అన్నారు. దానిని రచించిన మహనీయుడు అంబేద్కర్ కు ఘనంగా స్మరించుకుంటూ ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రాజ్యాంగం అమలులో...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మహిళా సాధికారికతకు అర్థం చెబుతూ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాజ్యాంగం మనకు క్రమశిక్షణ నేర్పించే రూల్ బుక్ అని ఆయన అన్నారు. రాజధానికి సేకరించిన భూములను పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. 35 నెలల్లో మనందరి ప్రభుత్వం మనసు పెట్టి సామాజిక న్యాయం అమలు చేసిందన్నారు.


Tags:    

Similar News