జగన్ సర్కార్‌పై ఆస్ట్రేలియన్ బృందం ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆస్ట్రేలియాకు చెందిన పార్లమెంటు సభ్యుల వాణిజ్య ప్రతినిధుల బృందం కలిసింది.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆస్ట్రేలియాకు చెందిన పార్లమెంటు సభ్యుల వాణిజ్య ప్రతినిధుల బృందం కలిసింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలసిన బృందంలోని సభ్యులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై ఆసక్తికనపర్చారు. వాణిజ్యంపట్ల ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆస్ట్రేలియా ఎంపీలు ప్రశంసలు కురిపించారు.
అభినందించడంతో పాటు...
ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ కుచెందిన లేబర్ పార్టీ ఎంపీలు ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. వీరిలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రభుత్వ విప్ తో పాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కూడా ఉన్నారు. ప్రధానంగా ఇంధన రంగం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలపై ముఖ్యమంత్రి జగన్ చూపిస్తున్న చొరవను వారు అభినందించడమే కాకుండా వారు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఇక్కడి కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయని వారు జగన్ కు తెలిపారు.
శ్రద్ధగా విన్న....
ప్రభుత్వ విప్ లీ టార్లామిస్, డిప్యూటీ స్పీకర్ మాథ్యూ ఫ్రెగాన్ లు స్పందిస్తూ ఇక్కడకు, మాకు విద్య విధానాలపై సారూప్యత ఉందని తెలిపారు. ఒకరికొకరు వాణిజ్య పరంగా సాయం చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పవన, సౌరశక్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆసక్తికరమైన కార్యక్రమాలను గురించి శ్రద్ధగా విన్నారు. ముఖ్యమంత్రి తమకు సమయాన్ని కేటాయించడం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.