మరికాసేపట్లో జగన్ కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ పై జగన్ మాట్లాడనున్నారు. మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ఈ కేసులను విచారిస్తున్న ధర్మాసనానికి కూడా అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు. దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని కూడా హైకోర్టుకు ఏజీ తెలిపారు.
దీనిపై స్పష్టత ఇవ్వనున్న....
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చట్టాల ఉపసంహరణతో పాటు కొత్త బిల్లులను కూడా జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. కొత్త బిల్లుల్లో ఏముంటోందనన్న ఉత్కంఠ నెలకొంది. కొత్త బిల్లులను ప్రవేశపెట్టి రెండు సభల్లో ఆమోదించుకుని జగన్ ముందుకు వెళతారని సమాచారం. న్యాయపరమైన చిక్కులు అథిగమించేలా కొత్త బిల్లులు ఉండే అవకాశముంది.