క్లైమాక్స్ కు పీఆర్సీ... నేడు ప్రకటన?
మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పీఆర్సీ పై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పీఆర్సీతో పాటు ఫిట్ మెంట్ పై కూడా ఈరోజు జగన్ ప్రకటించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి సీఎం కార్యాలయం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు రావడంతో ఫిట్ మెంట్ ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
ఈరోజు మరోసారి....
నిన్న ఉద్యోగ సంఘాలతో సమావేశమైన జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. తెలంగాణ తో పోల్చుకోవద్దని కూడా ఉద్యోగులకు హింట్ ఇచ్చారు. మరోసారి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన జగన్ ఫిట్ మెంట్ పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.