Ys Jagan : నేడు వైఎస్సార్ కల్యాణమస్తు నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ నేడు వైఎస్సార్ కల్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ నేడు వైఎస్సార్ కల్యాణమస్తు నిధులను విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఈ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. మొత్తం 78.53 కోట్ల రూపాయలను ఆయన లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
తల్లుల ఖాతాల్లో...
వధువుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులను జగన్ జమ చేస్తారు. అర్హులైన 10,132 జంటలు ఈ పధకం కింద నిధులు అందుకోనున్నారు. ఇప్పటి వరకూ ఈ పథకం కింద 56,194 మంది లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం 427.27 కోట్ల నిధులను అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.