ఈ నెల 26న శింగనమలకు జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 26వ తేదీ శింగనమల నియోజకవర్గంలో పర్యటించనున్నారు

Update: 2023-04-24 03:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 26వ తేదీ శింగనమల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలం కేంద్రంలో జగన్ పాల్గొననున్నారు. జగనన్న వసతి దీవెన నిధులను ఈ సందర్భంగా జగన్ విడుదల చేయనున్నారు. ఈ నెలలో రెండో వారంలో జరగాల్సిన జగన్ పర్యటన వాయిదా పడటంతో ఈ నెల 26వ తేదీన జరగనుందని అధికారులు తెలిపారు.

ఏర్పాట్ల కోసం...
దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానీయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులతో పాటు పోలీసు అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని అనంతపురం ఆర్డీవో మధుసూదన్ కు సూచించారు. హెలిపాడ్ నుండి సభాస్థలి వరకు బ్యారికేడింగ్ చేయాలని ఆర్అండ్ బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి ని ఆదేశించారు.


Tags:    

Similar News