Pawan Kalyan : కడపకు రానున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో కడపకు చేరుకోనున్నారు. అక్కడ కడప మున్సిపల్ హైస్కూలో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.
భారీ బందోబస్తు...
ఉదయం పదకొండు గంటలకు కడప చేరుకుని పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత జిల్లా జనసేన నేతలతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల తాకిడి లేకుండా పెద్దయెత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.