Flash : పవన్ కల్యాణ్ లేటెస్ట్ ట్వీట్ చూశారా? కలిసుంటే నిలబెడతామంటూ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ వైరల్ గా మారింది
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ వైరల్ గా మారింది. "కలిసి ఉంటే నిలబడతాం - విడిపోతే పడిపోతాం" అని డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ట్వీట్ లో ఏముందంటే?
ఇదే సమయంలో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ నుంచి "Unite we stand, divided we fall" అని పోస్టు చేయడం సంచలనంగా మారింది. క్యాజువల్ గా ఈ ట్వీట్ చేశారా? ఏపీ రాజకీయాలను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారా? లేక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఈ ట్వీట్ చేశారా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.