దిశ మార్చుకున్న తుపాను.. ఏపీకి తప్పిన ముప్పు
ఆంధ్రప్రదేశ్ జవాద్ తుపాను ముప్పు నుంచి తప్పించుకుంది. జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లింది;
ఆంధ్రప్రదేశ్ జవాద్ తుపాను ముప్పు నుంచి తప్పించుకుంది. జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లడంతో ఏపీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. జవాద్ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరప్రాంతానికి దగ్గరగా వచ్చిన జవాద్ తుపాను దిశ మార్చుకుని ఒడిశా వైపు వెళ్లడంతో ఏపీికి ముప్పు తప్పినట్లేనని వాతావరణ శాఖ తెలిపింది.
ఒడిశా వైపు....
ప్రస్తుతం జవాద్ తుపాను ఒడిశా వైపు కదులుతుంది. కొంత బలహీనపడుతూ పూరి వద్ద తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఒడిశాలో పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమయింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.