వామ్మో.. అరుదైన చేప తెచ్చిన తంటా ఎంటో తెలుసా?.. చివరికి..
ఏపీలో ఓ రైతులకు వింత అనుభవం ఎదురైంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో..
ఏపీలో ఓ రైతులకు వింత అనుభవం ఎదురైంది. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు బయలుదేరాడు. పొలంలోకి వెళ్లిన రైతుకు ఓ అరుదైన ప్రాణి కనిపించింది. ఇది మడ్డువలస రిజర్వాయర్ నుంచి పొలంలోకి వస్తున్న నీటిలో ఈ పొడవాడి ప్రాణి పాకుతూ వచ్చింది. దానిని చూసిన సదరు రైతు ఏదో ప్రమాదకరమైనది అనుకుని భయంతో పరుగులు తీశాడు. తర్వాత కొద్దిసేపటికి మరోసారి దాని వద్దకు వచ్చాడు ఆ రైతు. తర్వాత ఏం చేయలో తెలియక పెద్దగా కేకలు వేశాడు. ఈ రైతు కేకలు విన్న పక్కపొలంలోని రైతులు పరుగున వచ్చారు. అందరూ కలిసి పొలంలోనే ఆ ప్రాణి వద్దకు చేరుకొని పొడవుగా, లావుగా ఉన్న ఈ ప్రాణి అరుదైన జాతి గల పాము అని భావించారు. దీంతో వెంటనే కర్రలతో ఆ ప్రాణిని కొట్టారు. రైతులు కొట్టిన దెబ్బలకు కదల్లేక పోయింది ఆ ప్రాణి. ఆ తరువాత అందరూ కలిసి నెమ్మదిగా ప్రాణిని కర్రతో కదిలించగా అక్కడ కనిపిస్తుంది పాము కాదని, అరుదైన చేప అని నిర్ధారణకు వచ్చారు. ఆ చేప సుమారు ఐదు అడుగుల పొడవు, ఇరవై ఆరు కిలోల వరకు బరువు ఉందని భావించారు ఆ రైతులు. అయితే ఇక్కడే పెద్ద సమస్యల వచ్చి పడింది.