సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటీషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 9,10 షెడ్యూల్ కింద ఉమ్మడి సంస్థ విభజన జరగలేదని పిటీషన్ లో పేర్కొంది

Update: 2022-12-14 12:50 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 9,10 షెడ్యూల్ కింద ఉమ్మడి సంస్థ విభజన జరగలేదని పిటీషన్ లో పేర్కొంది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షల కోట్టు నష్టపోవాల్సి వచ్చిందని తెలిపింది. వెంటనే సంస్థల విభజన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరింది. సంస్థల విభజనకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొంది.

లక్షల కోట్ల నష్టం...
ఈ సంస్థలు 91 శాతం తెలంగాణలోనే ఉన్నాయని, ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ఇది ఏపీ ప్రజల హక్కుల ఉల్లంఘన మాత్రమేనని పేర్కొంది. ఈ సంస్థల విలువ 1,41,606 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపింది. తక్షణమే ఈ సంస్థల విభజనకు ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరింది.


Tags:    

Similar News