వారందరి చేతుల్లోకి 4.34 లక్షల ట్యాబ్ లు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చేతుల్లోకి ట్యాబ్ లు వచ్చేసాయి

Update: 2023-12-21 09:51 GMT

andhra pradesh government giving tabs to students 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చేతుల్లోకి ట్యాబ్ లు వచ్చేసాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను ఇస్తోంది. ఈ ఏడాది రూ.620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు 4,34,185 ట్యాబ్ లను అందించింది ప్రభుత్వం. ఈ ట్యాబ్ లలో రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ను ప్రిలోడెడ్ గా ఉంది. ట్యాబ్ ధర రూ.17,500 తో కలిపి ప్రతీ విద్యార్థికి రూ.33 వేల మేర లబ్ది కలుగుతుందని చెప్పారు. రెండేళ్లలో 9,52,925 ట్యాబ్ లు (విద్యార్థులు, టీచర్లకు కలిపి) పంపిణీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. వీటి విలువ రూ.1,305.74 కోట్లు అని అధికారులు చెప్పారు.



విద్యార్థులకు అందించిన ట్యాబ్ లలో ఇంటర్మీడియెట్ కంటెంట్ ను కూడా అప్ లోడ్ చేసేలా మార్పులు చేశామన్నారు. ఇందుకోసం ట్యాబ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని 256 జీబీకి పెంచారు. అవాంఛనీయ సైట్లు, యాప్స్ ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఇన్ బిల్ట్ గా పొందుపరిచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ (డౌట్ క్లియరెన్స్ బాట్) అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో (DUOLINGO) ఇన్ స్టాల్ చేశారు. విద్యార్థులను గ్లోబల్ సిటీజన్లుగా తీర్దిదిద్దేలా ఫ్యూచరిస్టిక్ స్కిల్స్లో భాగంగా ఐవోటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ లిటరసీ, మెటావర్స్, డేటా ఎనలెటిక్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎల్ఎల్ఎం, వీఆర్, ఏఆర్ వంటి పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది ఏపీ ప్రభుత్వం.



Tags:    

Similar News