ఏపీలో థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూతబడిన థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పింది.

Update: 2021-12-30 05:29 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్ల యజమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మూతబడిన థియేటర్లు తెరుచుకోవచ్చని చెప్పింది. నిబంధనలను అతిక్రమించారని థియేటర్లపై అధికారులు దాడులు చేసి పలు థియేటర్లను సీజ్ చేశారు. దీంతో మిగిలిన థియేటర్ల యజమానులు కూడా స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేశారు. ఏపీలో మొత్తం 175 థియేటర్ల వరకూ మూతబడినట్లు సమాచారం.

నెల రోజుల గడువు....
అయితే కొద్దిసేపటి క్రితం సినీ నిర్మాత, నటుడు నారాయణమూర్తి నేతృత్వంలో థియేటర్ల యజమానులు మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆయనను కలసి తమ గోడును చెప్పుకున్నారు. అయితే మూతపడిన, సీజ్ చేసిన థియేటర్లను తెరుచుకోవచ్చని మంత్రి పేర్ని నాని తెలిపారు. జరిమానాలను చెల్లించి తెరుచుకోవచ్చని, జరిమానాల చెల్లింపుకు నెల రోజులు గడువు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అధికారులకు తమ దరఖాస్తులను పెట్టుకుని తిరిగి థియేటర్లు తెరుచుకోవచ్చని పేర్ని నాని సూచించారు.


Tags:    

Similar News