జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల ఎప్పుడంటే?
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేసే తేదీని ప్రకటించింది
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యాదీవెన పథకం కింద నిధులను విడుదల చేసే తేదీని ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన జగనన్న విద్యాదీవెన పథకం కింద నిధులను జగన్ బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 18వ తేదీ విద్యాదీవెన పథకం కింద నిధులు విడుదల చేయాల్సి ఉండగా, దానిని ఒక రోజు వాయిదా వేసి 19న జగన్ విడుదల చేయనున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో...
తిరువూరు నియోజకవర్గంలో ఇందుకోసం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. తిరువూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆవరణలో నిధులను జగన్ విడుదల చేయనున్నారు. లబ్దిదారులనుద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి కోసం ప్రతి ఏడాది రెండు వాయిదాల్లో ఇరవై వేల రూపాయల నగదును లబ్దిదారులకు జగన్ అందచేస్తూ వస్తున్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కు పదిహేను వేలు, ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు పది వేల రూపాయలు నిధులను అందచేస్తున్నారు.