Andhra Pradesh : వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఖాళీగా ఉన్న అథ్యాపక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కోర్టు కేసుల కారణంగా ఇప్పటి వరకూ భర్తీ చేయని పోస్టులను ఇప్పుడు పూర్తి చేయనున్నారు. గత ప్రభుత్వం మొత్తం 3,295 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా న్యాయస్థానాన్ని కొందరు అభ్యర్థులు ఆశ్రయించడంతో భర్తీ జరగలేదు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే న్యాయపరమైన అంశాలను తొలగించి నిబంధనల మేరకు పూర్తి చేయడానికి సిద్ధమయింది.
పోస్టులన్నింటినీ...
ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ అధికారికంగా ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి మరో కొత్త ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్, బ్యాక్‌లాగ్ పోస్టుల్లో నిబంధనలను పాటించకపోవడం వల్లనే కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. వీటిని పరిశీలించిన తర్వాత కొత్త ప్రకటనను జారీ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈపోస్టులన్నీ భర్తీ చేసేందుకు త్వరలో ప్రకటన విడుదలవుతుందని ప్రభుత్వవర్గాలు కూడా ధృవీకరించాయి.