Andhra Pradesh : జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ కె.ఎస్. జవహర్ రెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.

Update: 2024-06-28 02:18 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ కె.ఎస్. జవహర్ రెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ నెలాఖరుకు ఆయన పదవీ విరమణ చేయాలి. ఈనేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఈ పదవిలో ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్చేయాలని ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

పూనం మాలకొండయ్యకు...
అలాగే వెయిటింగ్ లో ఉన్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఆమెను సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ పోస్టులో ఉన్న పోలా భాస్కర్ ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో పాటు ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా పియూష్ కుమార్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయనకేంద్ర సర్వీసులన నుంచి ఏపీ కేడర్ కు వచ్చారు. ఆయనకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు.


Tags:    

Similar News