Andhra Pradesh : నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లయ్ చేసుకోండి

ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది;

Update: 2024-12-03 03:04 GMT
state government, postponed, elections, andhra pradesh
  • whatsapp icon

ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. సెకండరీ హెల్త్ లో మరో 97 మంది డాక్టర్ల భర్తీ చేయనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 4 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది.రెగ్యులర్‌ పోస్టులతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా భర్తీ చేసేందుకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల అర్హతలు, మార్గదర్శకాలు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

నోటిఫికేషన్ ప్రకారం...
ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ల పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం, ఎంపికైన వారిని పీహెచ్‌సీలు/ఇతర వైద్య సంస్థల్లో నియమిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. http:apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారం ఉంటుంది, డిసెంబర్ 4 నుంచి 13 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.


Tags:    

Similar News