ప్రభుత్వం సీరియస్.. యూనిట్ మూసివేతకు ఆదేశం
అనకాపల్లి జిల్లాలోని బ్రాండిక్స్ కంపెనీలో కార్యకలాపాలను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది
అనకాపల్లి జిల్లాలోని బ్రాండిక్స్ కంపెనీలో కార్యకలాపాలను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కంపెనీలో సీడ్స్ యూనిట్ ను మూసి వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతరహితంగా వ్యవహరిస్తే ఏ కంపెనీని ఊరుకునేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది. విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కమిటీ నివేదిక వచ్చేంత వరకూ సీడ్స్ యూనిట్ ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
నివేదిక వచ్చేంత వరకూ...
బ్రాండిక్స్ కంపెనీలో రసాయనాలు లీక్ అయిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. యూనిట్ ను మూసివేయడమే కాకుండా, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. విచారణ పూర్తయ్యేంత వరకూ ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించరాదని ఆదేశించినట్లు తెలిపారు. కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారు కోలుకునేంత వరకూ అవసరమైన వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వమే కల్పిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాధ్ తెలిపారు. నిన్న బాండ్రిక్స్ కంపెనీలో రసాయనాలు లీకయి దాదాపు వంద మందికి పైగా మహిళలు అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే.