Andhra Pradesh : ఆ కార్డు చూపిస్తే చాలు..కొత్త జంటలకు గుడ్ న్యూస్ అంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయించింది.

Update: 2024-08-11 03:10 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను కొత్తవి మంజూరు చేయాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డులు జారీ చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. గత ప్రభుత్వంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు వేరే కాపురం పెట్టినప్పటికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

కొత్తగా పెళ్లయిన...
అయితే కూటమి ప్రభుత్వం మాత్రం కొత్త జంటలకు రేషన్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మ్యారేజి రిజిస్టర్ సర్టిఫికేట్ చూపిస్తే రేషన్ కార్డు ఇస్తారు. మొత్తం ఏపీలో ఇప్పటి వరకూ 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 89 లక్షల రేషన్ కార్డులు ఆహార భద్రత చట్టం కింద నిత్యావసరాలు సరఫరా చేస్తుంది. కొత్తగా పెళ్లయిన జంటలకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News