ఏపీలో మందుబాబులకు శుభవార్త... ధరలు తగ్గుతాయి.. అన్ని బ్రాండ్లు లభ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం పన్ను రేట్లలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్లలో హేతుబద్ధత కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై ఐదు నుంచి పన్నెండు శాతం ధరలు తగ్గే అవకాశముంది. మిగిలిన కేటగిరీలపై ఇరవై శాతం వరకూ ధరలు తగ్గనున్నాయి.
ఇకపై అన్ని బ్రాండ్లు...
ఆంధ్రప్రదేశ్ లో ఇక అన్ని బ్రాండ్ల మద్యం లభించేలా కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్లు అన్నీ ఇక అందుబాటులో ఉండనున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారాను అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.