సుప్రీంకోర్టుకు వెళ్లడం గ్యారంటీ...ఎప్పుడంటే?

రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలన్న యోచనలో ఉంది.;

Update: 2022-03-04 06:14 GMT

రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలన్న యోచనలో ఉంది. సుప్రీంకోర్టులో పిటీషన్ వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. వచ్చే సోమవారం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై పిటీషన్ వేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తీర్పు పట్ల జగన్ పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. శాసనసభకు కూడా చట్టం చేసే అధికారం లేదని అనడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సోమవారం ...?
దీంతోపాటు ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ను, మూడు నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని ఆదేశించడంపై కూడా ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిధుల అవసరం ఉంటుందని, టైమ్ ఫిక్స్ చేస్తే ఎలా అని కూడా ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో పిటీషన్ వేసిన ఒక్కొక్క రైతుకు యాభై వేలు పరిహారం చెల్లించాలనడంపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. రానున్న సోమవారం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లే అవకాశముంది.


Tags:    

Similar News