Andhra Pradesh : నేటి నుంచి జిల్లా కలెక్టర్ల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తుంది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు కలెక్టర్లకు వివరించనున్నారు. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. వరసగా తమ శాఖలకు చెందిన పురోగతిని ఉన్నతాధికారులు వివరించనున్నారు.
ప్రభుత్వ పథకాలను...
ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు అర్హులైన వారికి చేర్చడం తో పాటు జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించనున్నారు. ప్రధానంగా జిల్లాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరనున్నారు. ఆర్థిక పరమైన సమస్యలు మాత్రమే కాకుండా ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ముందుండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఉగాది నుంచి ప్రారంభమయ్యే పీ4 పథకం అమలుపై కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశముంది.