Chandrababu : నేడు చెన్నైకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చెన్నైకి వెళ్లనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు చెన్నైకి వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ఇండియన్ రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ - 2025లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ లో ఆయన ప్రసంగం ఉండనుంది. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం పదకొండు గంటలకు చెన్నై చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆయన నేరుగా మద్రాస్ ఐఐటీకి వెళతారు.
మీనంబాకం ఎయిర్ పోర్టులో...
చంద్రబాబు నాయుడు చెన్నై వస్తుండటంతో అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. మీనం బాకం ఎయిర్ పోర్టులో దిగిన చంద్రబాబుకు భారీ స్వాగతం పలికేందుకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చెన్నై వస్తుండటంతో ఆయన కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. తిరిగి మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి తిరిగి అమరావతికి చేరుకుంటారు.