Andhra Pradesh : నేడు వరద బాధితులకు గుడ్ న్యూస్... 25 వేలు జమ
వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేయనుంది. వారి ఖాతాల్లో జమ చేయనుంది
వరద బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేయనుంది. వారి ఖాతాల్లో జమ చేయనుంది. ముంపు ప్రభావిత 179 సచివాలయాల పరిధిలో అత్యంత పారదర్శకంగా నష్ట గణన ప్రక్రియను పూర్తిచేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అధికారులు సమర్పించారు. దీంతో ఈరోజు వరద బాధితుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. బాధితుల ఖాతాల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా పరిహారం మొత్తాన్ని జమచేయనున్నారు. ఏ ఒక్క బాధిత కుటుంబం ఎన్యూమరేట్ కాకుండా ఉండకూడదనే ఇన్నాళ్లు ఆలస్యమయిందని చెబుతున్నారు.
వరదల కారణంగా...
వరదల కారణంగా మునిగిపోయిన ఫస్ట్ ఫ్లోర్ యజమానులకు ఇరవై ఐదు వేల రూపాయలు, మిగిలిన ఇళ్లకు పదివేల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందచేయనున్నారు. వరదల కారణంగా నష్టపోయిన పంటలకు కూడా హెక్టార్ కు పాతిక వేల రూపాయలు అందచేయనున్నారు. రైతుల ఖాతాల్లో కూడా నేడు పాతిక వేల రూపాయలు జమ చేయాల్సి ఉంది. ఇక వరదల్లో పాడైపోయిన ద్విచక్రవాహనాలకు మూడు వేల రూపాయలు, మూడు చక్రాల వాహనాలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఆర్థిక సాయాన్ని నేడు లబ్దిదారుల ఖాతాల్లో జమ కానుందని అధికారులు తెలిపారు.