వైఎస్ జగన్ కు హైకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పార్టీ రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రభుత్వం వాడుతుందన్న ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రకటనల జారీ చేేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాలని తెలిపింది.
ప్రజాధనాన్ని...
ఈ మేరకు జగన్ కు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. జగన్ తో పాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్స్ ఎండీ, ఇందిరా టెలివిజన్ ఎండీ, విశాఖలోని సీబీఐ ఎస్పీలకు నోటీసులు జారీ చసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.