సమ్మె నోటీసిచ్చిన వారు విచారణకు రావాల్సిందే... హైకోర్టు ఆదేశం

సమ్మె నోటీసిచ్చిన వారు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది

Update: 2022-01-24 08:20 GMT

పీఆర్సీపీ పిటీషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జడ్జి ఎదుట హాజరు కావాలని పిటీషనర్ కు ఆదేశం, సమ్మ ె నోటీసుల ఇచ్చిన 12 మంది ఉద్యోగ సంఘాల నేతలు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు పీఆర్సీ కారణంగా తమ జీతాల్లో కోత పడుతుందని, విభజన చట్ట ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు.

బెదిరిస్తున్నారా?
అసలు హైకోర్టులో పిటీషన్ వేసి సమ్మె నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా? అని వ్యాఖ్యానించింది. సమ్మె నోటీసులు ఇచ్చే పన్నెండు మంది సభ్యులు హైకోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేైసింది.


Tags:    

Similar News