Nara Lokesh : సత్యనాదెళ్లను కలసిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై చర్చించారు. ఏపీలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై నారా లోకేష్ సత్యనాదెళ్లతో చర్చించారు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా నారా లోకేష్ సత్యనాదెళ్లను కోరారు.
సహకారం అవసరమని...
అమరావతి ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు మీ సహకారం అవసరమని తెలిపారు. అందుకు మీరు సహకరించాలని త్వరగా ఏఐ రాజధానిగా ఏర్పడుతుందని తెలిపారు. సత్యనాదెళ్లను ఒకసారి ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాల యువతీయువకులతో నారా లోకేష్ ఈ సందర్భంగా ఫొటోలు దిగారు.