దూసుకొస్తున్న జవాద్ తుపాను.... ఏపీ సర్కార్?

జవాద్ తుపాను పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమయింది. తుపాను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నాహాలను పూర్తి చేసింది.;

Update: 2021-12-04 01:38 GMT

జవాద్ తుపాను పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమయింది. తుపాను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నాహాలను పూర్తి చేసింది. ఐదు జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాకు పది కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ నిధులతో తుపాను సహాయ కార్యక్రమాలతో పాటు వెంటనే దెబ్బతిన్న పనులను పునరుద్ధరించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఐదు జిల్లాల్లో అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు.

జిల్లాకు పది కోట్లు...
ీదీంతో పాటు సహాయ శిబిరాలను ముందుగానే ఏర్పాటు చేసుకుని, అక్కడ విద్యుత్తు సమస్యల తలెత్తితే జనరేటర్ల ద్వారా విద్యుత్తును సరఫరా చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. సహాయ శిబిరాల్లో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని, రిస్క్ ఆపరేషన్ ను వెంటనే చేపట్టేలా బృందాలు ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు.


Tags:    

Similar News