Cyclone Alert : ఏపీ ప్రజలకు హెచ్చరిక.. తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

'దానా' గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో దానా తుపాను కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Update: 2024-10-24 05:37 GMT

cyclone dana alert in Ap

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా 'దానా'గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతెలిపింది. తుపాన్పారాదీప్ కి 260 కిమీ., ధమ్రాకు 290 కిమీ.,సాగర్ ద్వీపానికి 350 కిమీ దూరంలో కేంద్రీకృతం అయిందని తెలిపింది. ఈఅర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా - ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థతెలిపింది.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తెలిపింది.తీవ్రతుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది.చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
హెచ్చరికలు ఇవే...
భారీ వృక్షాలు, చెట్ల దగ్గర కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దని హెచ్చరించింది. డిపోయిన చెట్లు, విరిగిన కొమ్మలను తొలగించాలని, వాటి కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్ షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండాలని కోరింది. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని వార్నింగ్ ఇచ్చింది. యాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని సూచిచింది. విద్యుత్తు, టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండాలని కోరింది.


Tags:    

Similar News