AP TET 2024: ఆంధ్రప్రదేశ్ TET ఫలితాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ AP టెట్

Update: 2024-11-02 13:26 GMT

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ AP టెట్ జూలై పరీక్ష ఫలితాలను నవంబర్ 4కి రీషెడ్యూల్ చేసింది. మొదట్లో, ఫలితాలను ఈరోజే ప్రకటించాలని భావించారు. కొన్ని కారణాల వలన ఫలితాలు వాయిదా పడినట్లు సమాచారం. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్ aptet.apcfss.inలో ఫలితాలను చూసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ అర్హత సాధించిన అభ్యర్థులకు పాస్ సర్టిఫికేట్‌లను జారీ చేస్తుంది.

AP TET పరీక్ష అక్టోబరు 3 నుండి 21 వరకు నిర్వహించారు. ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లతో: ఉదయం సెషన్ 9.30 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్ష మొదట ఆగస్టు 5 నుండి 20 వరకు జరగాల్సి ఉంది, అయితే అభ్యర్థులకు ప్రిపరేషన్‌కు మరింత సమయం ఇవ్వాలనే కారణంతో వాయిదా వేశారు. అన్ని పేపర్లకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీలు అందుబాటులోకి వచ్చాయి. తాత్కాలిక కీలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు అభ్యంతరాలను సమర్పించడానికి డిపార్ట్‌మెంట్ అనుమతించింది, ఫైనల్ కీలను ఖరారు చేయడానికి ఉన్నతాధికారులు వాటిని సమీక్షించారు.
AP TET 2024 ఫలితాలు డౌన్‌లోడ్ చేయండిలా!
అధికారిక వెబ్‌సైట్‌ aptet.apcfss.in ను సందర్శించండి
హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే ఫలితాల విభాగానికి నావిగేట్ చేయొచ్చు
అవసరమైన లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
మీ మార్కుల మెమోని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


Tags:    

Similar News