ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆ 8 జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక !
సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల
అమరావతి : ఏపీలో వేసవి తాపం మొదలైంది. వారంరోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుంది. ఏప్రిల్ కు ముందే ఇలా ఉంటే.. ఏప్రిల్ నెల ఆరంభమైతే ఎండలు ఇంకెలా ఉంటాయో అంటూ ప్రజలు జంకుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3-5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు మినహా.. మిగతా ప్రజలు వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచాయి.
మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాలలోని మొత్తం 153 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు బయట తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.