Chandrababu Naidu: ఆదుకుంటాం.. వారికి హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన

Update: 2024-07-27 03:37 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను, రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల ప్రజలు వరదల వల్ల నష్టపోయారని.. వరదల కారణంగా 4,317 ఎకరాల్లో పంట దెబ్బతినగా, 1.06 లక్షల ఎకరాల్లో వరి నారు నీట మునిగిందని తెలిపారు.

వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని తెలిపారు. ఆయా జిల్లాల మంత్రులు తమ ప్రాంతాల్లో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను సేకరించి తనకు అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వరదల కారణంగా 3,160 ఎకరాల మొక్కజొన్న, 960 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నాయని, ఈ నష్టం అంచనాలన్నీ ప్రాథమికమైనవని, అధికారులు పొలాలను సందర్శించినప్పుడు నష్టం గురించి మరింత తెలుస్తుందని సీఎం అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.


Tags:    

Similar News