పీఆర్పీపై నేడు జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

Update: 2021-12-28 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనలో ఉన్నాయి. చీఫ్ సెక్రటరీ సూచన మేరకు తమ ఆందోళనలను ఉద్యోగ సంఘాలు విరమించాయి.

అధికారులతో చర్చించి....
అయితే ఈరోజు జగన్ ముఖ్య అధికారులతో సమావేశమై పీఆర్సీ అంశంపై చర్చిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వం 14.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని యోచిస్తుంది. ఉద్యోగ సంఘాలు మాత్రం 34 శాతం కు ఒక్క శాతం కూడా తగ్గితే తిరిగి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాయి. ఈ నేేపథ్యంలో జగన్ నేడు అధికారులతో సమావేశంలో పీఆర్సీపై కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.


Tags:    

Similar News