Rain Alert : ఏపీలో భారీ వర్షాలు పడే జిల్లాలివే
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశముందని చెప్పింది
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశంఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. ఈ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. విజయనగరం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, కర్నూలు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు....
దీంతో సముద్ర తీరం వెంబడి 35-45 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది.