Andhra Pradesh : ఏపీ శాసనసభ స్పీకర్ పేరు ఫైనల్.. ఆయన కే ఆ పదవి
ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు ప్రొటెం స్పీకర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉండే అవకాశం ఉంది. ఆయన సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఆయననే ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
డిప్యూటీ స్పీకర్ గా...
175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందంటుననారు. స్పీకర్ గా అయ్యన్న పేరు దాదాపు ఖరారు అయిందని తెలిసింది. అయ్యన్న పాత్రుడకు స్పీకర్ పదవి ఇస్తుండటంతో జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతుంది.ఒకవేళ స్పీకర్ పదవి జనసేనకి ఇస్తే మండలి బుద్ధప్రసాద్ కు ఇచ్చే ఆలోచన లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లకు మంచి ఎంపిక అవుతుందని భావిస్తున్నారు