కాబోయే ఆ మంత్రుల ముగ్గురినీ అసెంబ్లీ లాబీల్లో?
త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు;
త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ముహూర్తం ఎప్పుడన్నది తెలియకపోయినా విస్తరణ మాత్రం ఖాయమని తేలిపోయింది. దీంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు తోటి శాసనసభ్యులు అభినందనలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండంతో లాబీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు వైసీపీ నేతలు అభినందనలు చెప్పారు.
ఈ ముగ్గురిని....
కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారధి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దాడిశెట్టి రాజా, విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్ లను పలువరు వైసీపీ ఎమ్మెల్యేలు అభినందించారు. కంగ్రాట్యులేషన్స్ మంత్రిగారూ అంటూ వారు అభినందనలు తెలపడం లాబీల్లో కన్పించింది. ఈ ముగ్గురికి ఖచ్చితంగా రానున్న మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారంతో వారికి ఎమ్మెల్యేలు ముందస్తుగానే అభినందనలు తెలిపారు.