రామోజీరావు, శైలజా కిరణ్ లకు సీఐడీ నోటీసులు

ఆ సమయంలో సిబ్బందిలో 10 మందిని అనుమతించలేదని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. మార్గదర్శి ఆర్థిక అక్రమాల

Update: 2023-06-22 10:04 GMT

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీ రావు, శైలజా కిరణ్ లకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి, గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్ కు జులై 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో ఏ1గా రామోజీ రావు, ఏ2 గా శైలజా కిరణ్ లు ఉన్నారు. జూన్ మొదటివారంలో సీఐడీ అధికారులు శైలజా కిరణ్ ను ఆమె నివాసంలోనే విచారించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో సిబ్బందిలో 10 మందిని అనుమతించలేదని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. మార్గదర్శి ఆర్థిక అక్రమాల కేసులో ప్రశ్నించేందుకు వెళ్లిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు చిట్ ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. చట్టం ప్రకారం విచారణ చేసినా.. శైలజా కిరణ్ అందుకు సహకరించకుండా ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆమె కావాలనే తన వద్ద లేకుండా చేసుకున్నారని చెప్పారు. ఎండీగా పూర్తి సమాచారం తనవద్ద ఉండాల్సిన అవసరం లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిపారు. మార్గదర్శి నిధుల మళ్లింపుపై వాస్తవాలను బయటికి రానివ్వకుండా ప్రయత్నించారన్నారు.
శైలజా కిరణ్ ను అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామన్న సీఐడీ ఎస్పీ.. అందుకే మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన్లు తెలిపారు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను అటాచ్ చేసేందుకు త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News