బ్రేకింగ్ : ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్... పదిరోజుల్లోనే?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఆయన స్వయంగా చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని ఆయన స్వయంగా చెప్పారు. తిరుపతిలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను అక్కడి ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పీఆర్సీని ప్రకటించాలని కోరగా ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.
ఆందోళనకు....
పీఆర్సీ తదితర సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. చీఫ్ సెక్రటరీకి కూడా నోటీసులు ఇచ్చారు. డిసెంబరు 7వ తేదీ నుంచి దశల వారీగా ఉద్యోగులు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.