పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 12,911 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ప్రాజెక్టు పనులను

Update: 2023-06-06 06:02 GMT

పోలవరం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. కాఫర్ డ్యామ్ పనులు, ఇప్పటి వరకు పూర్తైన పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పోలవరం పనుల పురోగతిపై అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్‌ తిలకించారు. వరదల సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం పెంచిన ఎత్తు తీరును, పూర్తైన పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 12,911 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బిల్లుల చెల్లింపులో విభాగాల వారీగా పెట్టిన పరిమితులను తొలగించేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. 2013-14 ధరలతో కాకుండా తాజా ధరల ఆధారంగా నిధులు చెల్లించేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్ ఎల్ కే త్రివేది సోమవారం రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆమెదించినట్టు లేఖలో స్పష్టం చేశారు. సీఎం జగన్ ఇప్పటి వరకూ అనేకమార్లు పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం ఢిల్లీకి వెళ్లారు. రూ.10 వేల కోట్ల అడ్ హక్ నిధులిచ్చి ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మోదీ.. నిధులు విడుదల చేయాలని జలశక్తి శాఖకు ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News