Ys Sharmila : వైఎస్ జగన్ పై షర్మిల మరోసారి ఫైర్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2024-11-11 07:14 GMT

ys sharmila

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై మరోసారి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుఅత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందన్నారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? అని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందదన్నారు. జగన్ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే... ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని తెలిపారు.

కూటమి ప్రభుత్వంపైనా...
అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశమన్న వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదపిని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు వైఎస్ షర్మిల. ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, బెల్టు షాపుల దందాను అరికట్టలేదని, అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదంటూ మండిపడ్డారు. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే... ప్రతిపక్షం ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటని వైఎస్ షర్మిల అన్నారు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరమన్నారు.


Tags:    

Similar News