నేడు భానుడు మండిపోతాడు
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు, వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు,ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో...
ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచింది.