పీఆర్సీపై ఏపీ ప్రభుత్వోద్యోగుల సంఘం అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని వారు లేఖలో పేర్కొన్నారు. వెంటనే సీపీఎస్ ను రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెట్టాలని వారు లేఖలో కోరారు. కనీసం 30 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదని కోరారు.
పెన్షనర్లకు..
70 నుంచి 79 ఏళ్ల వయసున్న పెన్షనర్లకు పది శాతం అదనంగా పెన్షన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హెచ్ఆర్ఏ విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఫిట్ మెంట్ విషయంలో పునరాలోచించాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని లేఖలో పేర్కొంది.